అయోడిన్ ఉప్పు వాడకంతొ శారీరక మానసిక ఎదుగుదల
1 min read– జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు అయోడిన్ ఉప్పు వాడడం వల్ల పిల్లల్లో శారీరిక మానసిక ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు అన్నారు. బుధవారం ఆయన స్థానిక ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, సమాజంలో పోషకాహార స్థితిని అధ్యయనం చేసుకోవడానికి అయోడిన్ కు సంబంధించి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు, ముఖ్యంగా పిల్లలలో అయోడిన్ లోపం వల్ల మానసిక తీరు, బలహీనపడటం, శారీరక అభివృద్ధి ఆలస్యం కావడం, అలాగే అయోడిన్ ప్రేరిత హైపర్ థైరాయిడిజం వంటి వాటికి దారితీస్తుందని ఆయన తెలియజేశారు, అయితే అయోడిన్ ఉప్పు వాడడం వల్ల శరీరానికి కావాల్సినంత సూక్ష్మ పోషకాలు లభ్యమవుతాయని ఆయన తెలియజేశారు, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఈ విషయంపై సమర్థవంతంగా అధ్యయనం చేసేందుకు (ఎన్ ఐ డి డి సిపి) మార్గదర్శకాలు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నారు, దీని ద్వారా జిల్లా స్థాయిలో అయోడిన్ లోపం రుగ్మత( ఐ డి డి) యొక్క అంచనాలు వేయడం దీని ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు, ఇందుకు సంబంధించి 90 మంది పిల్లలకు గాయిటర్ అసెస్మెంట్ చేయడం జరుగుతుందన్నారు అలాగే 18 మంది పిల్లల యొక్క భోజనంలో ఉపయోగించే ఉప్పు సేకరణ, అదేవిధంగా పిల్లల యొక్క 3-4 ఎంఎల్ మూత్ర నమూనాను 9మంది పిల్లల ద్వారా సేకరించడం జరుగుతుందని వారు తెలిపారు, దీనిని రాష్ట్రస్థాయిలో అధ్యయనానికి పంపించడం జరుగుతుందని వారు విద్యార్థులకు అయోడిన్ ఉప్పు విశిష్టత గురించి తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉప అధికారి ఉమామహేశ్వ రాకుమార్, మండల వైద్యాధికారి డాక్టర్ చెన్నారెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ వెంకట చంద్ర రెడ్డి, డాక్టర్ ఖాజా మోదీన్, ప్రధానోపాధ్యాయులు పద్మనాభం, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.