PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ వారం విడుద‌ల‌య్యే చిత్రాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : లాక్ డౌన్ ఆంక్షలు చాలా ప్రాంతాల్లో స‌డ‌లించ‌డంతో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. థియేట‌ర్లకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో తెలుగు సినిమాలు ఓటీటీల్లో కాకుండా డైరెక్ట్ గా థియేట‌ర్లలో విడుద‌ల చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ వారం ప‌లు సినిమాలు థియేట‌ర్లలో విడుద‌ల‌కు సిద్ధమ‌య్యాయి.

  1. నూటొక్క జిల్లాల అంద‌గాడు
    శ్రీనివాస్ అవ‌స‌రాల న‌టించిన చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు. రుహానీ శ‌ర్మ హీరోయిన్. రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. బ‌ట్టత‌ల కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెర‌కెక్కించారు. సెప్టంబ‌ర్ 3న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ సినిమా ట్రైల‌ర్ వినోదాత్మకంగా ఉండ‌టంతో సినిమా పై అంచ‌నాలు పెరిగిపోయాయి.
  2. డియ‌ర్ మేఘ‌
    అరుణ్ అదిత్, అర్జున్ సోమ‌యాజులు, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన చిత్రం డియ‌ర్ మేఘ‌. సుశాంత్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అర్జున్ దాస్యన్ నిర్మాత‌. సెప్టంబ‌ర్ 3న ఈ సినిమా కూడ విడుద‌ల కానుంది. భావోద్వేగాలే ప్రధానంగా ఈ ప్రేమ‌క‌థా చిత్రం తెర‌కెక్కింది. 300 థియేట‌ర్లలో ఈ చిత్రం విడుద‌ల కానుంది.
  3. అప్పుడు ఇప్పుడు
    సుజ‌న్, త‌నిష్క్ జంట‌గా న‌టించిన చిత్రం అప్పుడుఇప్పుడు. చ‌ల‌ప‌తి పువ్వల ద‌ర్శకత్వం వ‌హించారు. ఉషా క‌నుమూరి, విజ‌య రామ‌క్రిష్ణంరాజు నిర్మాతలు. ఈ సినిమా సెప్టంబ‌ర్ 3న విడుద‌ల కానుంది. వినోదాత్మక చిత్రంగా అప్పుడు ఇప్పుడు తెర‌కెక్కింది.

About Author