జగన్ అక్రమాస్తుల కేసులపై హైకోర్టులో పిల్ !
1 min readపల్లెవెలుగు వెబ్: జగన్ అక్రమాస్తుల కేసుపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులను సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయడంలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. దర్యాప్తులో దృష్టికి వచ్చిన అంశాలు సీబీఐ,ఈడీ వదిలిపెట్టాయని రఘురామ పిటిషన్ లో వివరించారు. కేసులకు తార్కిక ముగింపు ఇవ్వడంలో సీబీఐ, ఈడీ విఫలమయ్యాయని తెలిపారు. విచారణలో గుర్తించిన అన్ని అంశాలపై దర్యాప్తు చేసేలా సీబీఐ,ఈడీని ఆదేశించాలని కోరారు.