పినాక ఉచిత శిక్షణ తరగతుల కరపత్రం ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగకరమైన స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ జీకే గ్రూప్ గైడెన్స్ సివిల్ గైడెన్స్ కోర్సులు ఉచితంగా అందించే పినాక ఉచిత శిక్షణ తరగతుల కరపత్రాలను నేడు కర్నూల్ నగరంలోని బీసీ భవన్ లో రాయలసీమ,కులసంఘాల,ప్రజా సంఘాల నాయకులు ఎం.కె రంగస్వామి,రాయలసీమ రవికుమార్,కృష్ణ చాపే,కే.రామకృష్ణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా రాయలసీమ జిల్లాలలో పేద,గ్రామీణ ప్రాంత ఇంటర్,డిగ్రీ,బీటెక్,ఎంబీఏ,ఎంసీఏ తదితర కోర్సులు చేస్తూ,పూర్తి చేసీ ఉద్యోగాలకు సమాయత్తమవుతున్న విద్యార్థుల కోసం 21రోజులపాటు ఉచిత శిక్షణా తరగతులను రాయలసీమ వ్యాప్తంగా 10సెంటర్లలో గత పదిసంవత్సరాలుగా ఐఆర్ఎస్ అధికారి బి.యాదగిరి,అమీలియో,సురక్షిత హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ ల ఆధ్వర్యంలో పినాక సంస్థ నిర్వహిస్తోందని కర్నూలు నగరంలో ఈ సంవత్సరం కూడా ఈ శిక్షణ తరగతులు ఈనెల 15న కర్నూలు నగరంలోని రెవెన్యూ కాలనీలో సాయి సుబ్బయ్య రవీంద్ర హైస్కూల్ లో మొదలవుతాయని 21రోజుల పాటు కొనసాగి వచ్చే నెల జూన్ 4న ముగుస్తాయని విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజన సదుపాయంతో పాటు విద్యార్థినిలకు హాస్టల్ వసతి కల్పిస్తున్నామని వివరాలకు 9177764147,6301094744 నెంబర్లను సంప్రదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కురువ శ్రీనివాసరావు,బత్తుల లక్ష్మీకాంతయ్య,పాలకొమ్మ అశోక్,ఎర్రకోట మల్లప్ప,మోహన్, హేమంత్ గౌడ్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.