పవన్.. ముందు రాజకీయాల్లో ఉన్నావో, లేదో తేల్చుకో !
1 min read
పల్లెవెలుగువెబ్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు రాజకీయాల్లో ఉన్నారో లేదో పవన్‌కల్యాన్ తేల్చుకోవాలని ఆయన అన్నారు. పవన్‌కి ఒక విధానం, కార్యాచరణ, స్పష్టత లేదన్నారు. జనసేన పొత్తులు గురించి ఆలోచిస్తారా లేక.. మొక్కజొన్న పొత్తులు గురించి ఆలోచిస్తారో చూద్దామని ఆయన సెటైర్లు వేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే వెళతామని ఆయన స్పష్టం చేశారు. తమతో ఎవరైనా కలిసి వచ్చేవారుంటే ఆ విషయంపై జగన్ నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు.