పవన్ స్పీచ్.. పిట్టల దొర ప్రసంగంలా ఉంది !
1 min readపల్లెవెలుగువెబ్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం పిట్టల దొర ప్రసంగం లా ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ…. బీజేపీ చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మ అని అన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఒక శని గ్రహంలాంటిదని… రాష్ట్రానికి నెంబర్ ఓన్ ద్రోహి బీజేపీ అని వ్యాఖ్యలు చేశారు. అటువంటి బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్‌తో ముందుకు పోతానని పవన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదుతా అన్నట్టు ఉంది పవన్ తీరు అని ఆయన దుయ్యబట్టారు. సభా ప్రాంగణానికి కాంగ్రెస్ నాయకులు దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకుని అదే సభా ప్రాంగణం నుంచి కాంగ్రెస్ హటావో అనడం, రాహుల్ గాంధీని విమర్శించడం అవివేకమన్నారు.