రెవిన్యూ సమస్యల వలయంలో పిన్నాపురం ..!
1 min read–భూములకు పరిహారం ఇప్పించాలని ఎమ్మెల్యేకు గ్రామస్తుల విన్నపం..
–అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే కాటసాని హామ
పల్లెవెలుగు వెబ్, పాణ్యం: సోమవారం నాడు పాణ్యం మండలంలోని పిన్నాపురం గ్రామంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గడపగడప మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గ్రామంలో సోలార్ పరిశ్రమలు పోయిన భూములకు నష్టపరిహారం ఇప్పించాలని తమ పూర్వికులు గతంలో కొనుగోలు చేసిన భూములకు అనుభవంలో ఉన్నామని కానీ ఆన్లైన్ లో తమ పేరు లేకపోవడంతో పరిశ్రమ వారు రెవిన్యూ శాఖ పరిహారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ 212 సర్వే నంబర్లో ఉన్న అనుభవంలో ఉన్న ప్రతి రైతుకు పరిహారం అందేలా గ్రీన్ కో సోలార్ పరిశ్రమ ఎండితో తో మాట్లాడుతానని దయచేసి గ్రామంలో ఇతర ప్రాంతాల వారికి భూములు ఉన్నట్టు బంధువుల పేరిట కొంతమంది గొడవ చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని గతంలో ఓర్వకల్ పిన్నాపురంలో లో కొంతమంది భూములను కబ్జా చేశారని చెప్పడం సమంజసం కాదని 2019 తర్వాత అసైన్మెంట్ కమిటీ లేకపోతే ఎలా భూములు రాసుకుంటారని అసత్య ఆరోపణలపై తాను స్పందించనని తెలిపారు రెండు మూడు రోజుల్లోనే గ్రామస్తులకు గ్రామ సభ నిర్వహించాలని తాసిల్దార్ మల్లికార్జున్రెడ్డి ఎంపీడీవోకు పోలీసులకు ఆదేశించారు అర్హులైన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందించాలని ఆదేశించారు వైసీపీ ప్రభుత్వంలో ప్రతీ గడపకు ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న జనరంజక పాలన,అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించారుఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట కృషయ్య,మాజీ సర్పంచ్,సత్యాలు,రమణయ్య,నాగలక్షయ్య,వెంకట్,మాజీ జడ్పిటిసి సూర్య నారాయణ రెడ్డి, ఎంపీపీ హుసేన్ బీ,కరుణాకర్ రెడ్డి,వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు,చందమామ బాబు,తమ్మరాజుపల్లి సర్పంచ్ మధు,సర్పంచ్ కొణిదెడు, ఎంపీటీసీ రవి కుమార్ రెడ్డి,ఆలమూరు జయరాం రెడ్డి,తోకర్చెడు సర్పంచ్,భూపానపాడు ఎంపీటీసీ,భూపానపాడు సర్పంచ్,పాణ్యం ఉప సర్పంచ్,పాలెం చంద్రశేఖర్ రెడ్డి,కో-ఆప్షన్ మెంబెర్ జాకీర్,ఎం.ఆర్.ఓ మరియు ఎంపీడీవో ఇంకా మండలంలోని మరియు గ్రామంలోని పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు,కార్యకర్తలు,సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.