NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి పీకే.. బీజేపీని ఎదుర్కోగ‌ల‌రా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ .. మ‌రో కీల‌క పాత్ర పోషించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. వెంటిలేటర్ పై ఉన్న హ‌స్తం పార్టీకి ఊపిరిపోసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స‌మాచారం. బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ ను బ‌లోపేతం చేయడానికి తాను కాంగ్రెస్ లో చేరాల‌ని భావిస్తున్న‌ట్టు ఓ ప్ర‌తిపాద‌న అధిష్ఠానం వ‌ద్ద‌కు తీసుకువెళ్లార‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడి పాత్ర పోషించే విషయంపై ఆయన ఇటీవల అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంకలతో కలిసి చర్చించినట్లు సమాచారం. ప్రాంతీయ పార్టీలను జాతీయ స్థాయిలో ఒక కూటమిగా ఏర్పరిచేందుకు ఆయా పార్టీల నేతలతో చర్చలు జరిపారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మమతా బెనర్జీ, శరద్‌ పవార్‌, స్టాలిన్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, అఖిలేశ్‌ యాదవ్‌, కేసీఆర్‌, హేమంత్‌ సోరెన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌లతో ప్రశాంత్‌ కిశోర్‌కు ఉన్న సంబంధాలతో అందరినీ ఒకే వేదికపైకి ఆయన తీసుకురాగలరని ఈ వర్గాలు భావిస్తున్నాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, అసోం, హరియాణా, జార్ఖండ్‌లలో కాంగ్రె్‌సను బలోపేతం చేస్తే తప్ప.. బీజేపీని ఎదుర్కోవడం కష్టమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ బలహీనపడడం వల్ల 90 శాతం సీట్లను బీజేపీ గెలుచుకుంటోందని, ఈ నష్టాన్ని కనీసం 50 శాతానికి తగ్గిస్తే కాంగ్రెస్‌ పోటీలో నిలబడుతుందని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.

                                        

About Author