ఆటోనగర్ లో ఆటోమెకానిక్ కార్మికులకు స్థలాలు ఇవ్వాలి
1 min read
యూనియన్ అధ్యక్షులు ఉప్పులూరి హేమ శంకర్
అర్హత కలిగిన వారికి స్థలాలు కేటాయించాలి,మున్సిపాలిటీ అధికారుల వేధింపులు ఆపాలి
ది ఏలూరు కార్ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ డిమాండ్
15 సంవత్సరాలగా సమస్య పరిష్కారానికి రాక అయోమయంలో ఆటో వర్కర్స్ యూనియన్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ది ఏలూరు కార్ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటోనగర్ బి.బిట్ నందు ఆటోనగర్ లో స్థలాలు ఇవ్వాలని యూనియన్ సంఘ సభ్యులు, కార్మికులు, నాయకులు సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పాల్గొన్న ది ఏలూరు కార్ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ15సంవత్సరాలు పైగా ఏలూరు నగరంలో సొంతంగా షెడ్లు నిర్వహించుకుంటూ జీవనోపాధి పొందుతున్న సుమారు 200 మంది కార్మికులకు ఆటోనగర్లో స్థలాలు కేటాయింపులు చేయకపోవడంతో ఆటో కార్మికులు,నాయకులు అయోమయాన్ని గురయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏలూరు నగరంలో షెడ్లు నిర్వహిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఏలూరు మినీ బైపాస్ రోడ్డు, పవర్ పేట, సత్రంపాడు తదితర ప్రాంతాల్లో కార్ రిపేర్ మెకానిక్ షెడ్లు ఎక్కువగా ఉన్నాయని ముఖ్యంగా మినీ బైపాస్ రోడ్డు మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేసిన తర్వాతనే మరింత అభివృద్ధి చెందిందని తెలిపారు. ఏలూరు నగరంలో షెడ్లు నిర్వహిస్తున్న వారికి ఆటోనగర్ నందు స్థల కేటాయింపులు చేయకుండా మాజీ అధ్యక్షులు మాగంటి నాగభూషణం వివక్షత చూపించారని, తద్వారా అనేకమంది అన్ని అర్హతలు ఉన్న ఆటోనగర్లో స్థలాలు పొందలేకపోయారని అసహనం వ్యక్తం చేశారు. 2011 నుండి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆటోనగర్ లో సొంత స్థలాల కోసం అర్హత కలిగిన మెకానిక్ లు అనేక ఉద్యమాలను నిర్వహించగా 2014 వ సంవత్సరంలో అప్పటి కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఏడుగురు సభ్యులతో ఎంక్వయిరీ చేయించగా అర్హత కలిగిన మెకానిక్ లకు ఆటోనగర్ నందు స్థలం కేటాయింపులు చేయలేదని ఆ నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు. ఆనాటి నుండి ప్రభుత్వం, అధికారులు అర్హత కలిగిన ఆటోమొబైల్ వృత్తి దారులకు ఆటోనగర్ నందు స్థలం కేటాయింపులు చేయుటకు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు మున్సిపల్ అధికారులు ఇరిగేషన్ స్థలాలలో బోర్డులు పెట్టి మెకానిక్ షెడ్లు నిర్వహిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించడం దారుణమని విమర్శించారు. ఏలూరు నగరంలోని ప్రజలకు ఉపాధి కల్పించే రెండు జూట్ పరిశ్రమలు మూతపడి ఉపాధి కరువై ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మున్సిపల్ అధికారులు అద్దె స్థలాల్లో సొంత షెడ్లు నిర్వహించుకుంటూ కార్పోరేషన్ వారికి టాక్సులు కడుతున్న ఆటోమొబైల్ వృత్తి దారులు పని చేసుకోనివ్వకుండా వేధించడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకొని అర్హత కలిగిన మెకానిక్ లందరికీ ఆటోనగర్లో స్థలాలు కేటాయించాలని స్వయం ఉపాధి చేసుకుంటూ ఏలూరు నగరంలో జీవిస్తున్న ఆటోమొబైల్ వృత్తి దారులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎఐటియుసి ఆద్వర్యంలో ఉదయం ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ,కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తమ సమస్యను ప్రభుత్వానికి తెలియజేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో యూనియన్ కార్యదర్శి బొండాడ హరి నారాయణ మూర్తి, సహాయ కార్యదర్శి కొప్పిశెట్టి వెంకటపతి,మాజీ కార్యదర్శి కాదులూరీ చంద్ర శేఖర్, కోశాధికారి కాటూరి శ్రీధర్,కమిటీ సభ్యులు గ్రంధి నాగ రవి కిషోర్,పాలకొండ శ్యాం ప్రసాద్, బొడ్డు సురేష్, బిక్కసాని శ్రీనివాస్,గొర్రెల సీతారామయ్య,కోసూరి సురేష్, అరిగెల కాశీ విశ్వనాథ్, పెట్ట నాగు,తాళ్లూరి బాబురావు, మూసాఖాన్, టేకిపూడి పండు,ఆరేపరపు రఘు,తదితరులు పాల్గొన్నారు.