పంట దిగుబడికి.. సస్యరక్షణ చర్యలు తప్పనిసరి..
1 min read–హార్టికల్చర్ జిల్లా ఆఫీసర్ పి. రామాంజనేయులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఖరీఫ్‌లో సాగు చేసే పంటల అధిక దిగుబడికి సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని రైతులకు సూచించారు హార్టికల్చర్ జిల్లా ఆఫీసర్ పి. రామాంజనేయులు. మంగళవారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబరులో విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లాలో టమోటా, ఉల్లిగడ్డ, డ్రాగన్, మొక్కజొన్న, పత్తి, కంది తదితర పంటలు అధికంగా సాగు చేస్తారన్నారు. పంటల సాగుపై రైతులు జాగ్రత్తలు పాటించడంతోపాటు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. మామిడి కాయ సాగులో మెట్టతొలుచు పురుగు, కాయదొలుచు పురుగుల దాడి అధికంగా ఉంటుందని, సస్యరక్షణ చర్యలు తప్పకుండా పాటించాలని వివరించారు. పంట దిగుబడులు నిల్వ ఉంచేందుకు కర్నూలు, ఆదోనిలో స్టోరేజ్ గోదాములు ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంటల సాగులో ఏమైనా సందేహాలు ఉంటే… ఏ సమయంలోనైనా తమను సంప్రదించవచ్చని హార్టికల్చర్ జిల్లా ఆఫీసర్ పి. రామాంజనేయులు వెల్లడించారు.