వర్షాభావ పరిస్థితుల్లో భూముల లో పెంచే పంటలు వేసుకోవాలి
1 min readజిల్లా వ్యవసాయ శాఖ ప్రాజెక్టు మేనేజర్ నరేంద్ర రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల : నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజరు శ్రీ. నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నాడు ( గడివేముల మండలం, LK తాండ) రైతు శంకర్ నాయక్ పొలంలో డ్రాఫ్ట్ ప్రూఫ్ఫింగ్ మోడల్ వేశారు. ఈ మోడల్ వేసుకోవడం వల్ల రైతు వర్షబావ పరిస్థితుల్లో బెట్టను తట్టుకొని భూసారాన్ని పెంచుతూ పలుపంటల ద్వారా నిరంతర ఆదాయాన్ని పెంచే దిశగా చిన్న సన్న కారు రైతులను ప్రోత్సహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహేంద్ర రెడీ గారు, జిల్లా మార్కెటింగ్ NFA రవింద్ర అచారి , MT లత మరియు యూనిట్ సిబ్బంది ప్రభవతమ్మా , గ్రామసిబ్బంది సుధాకర్ నాయక్ మరియు లలితమ్మ రైతులు పాల్గొన్నారు.