PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మొక్కలు నాటడం.. అందరి బాధ్యత :డ్వామా పీడీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ప్రతిఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా భావించాలన్నారు కర్నూలు డ్వామా పీడీ బి. అమర్నాథ్​ రెడ్డి. బుధవారం కర్నూలు జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారి ఆధ్వర్యంలో సామర్ధ్య పెంపుదల శిక్షణ కేంద్రం ( డీసీబీసీ) లక్ష్మిపురం జగన్నాథగట్టు వద్ద మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పచ్చదనం ప్రాజెక్టులో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్​ బి.అమర్నాథ్​ రెడ్డి మాట్లాడుతూ మానవుల మనుగడకు మొక్కలే జీవనాధారమన్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే… రోగాలు దరిచేరవన్న పీడీ… కోవిడ్​ దృష్ట్యా భౌతికదూరం పాటిస్తూ. శానిటైజర్​, మాస్క్​ ధరించాలన్నారు. డీసీబీసీ లక్ష్మీపురం వద్ద డ్వామా సిబ్బంది 2వేల మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం వాటర్​షెడ్​ ఏపీడీ సలీంబాష, సిద్ధలింగ, ఏ పీ ఓ లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ లు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


About Author