మొక్కలు నాటడం.. అలవాటుగా మారాలి
1 min readపల్లెవెలుగు వెబ్, చిట్వేలి : విద్యార్థి దశ నుంచే పిల్లలకు మొక్కలు నాటడం, పెంచడం అలవాటుగా మారాలని పిలుపునిచ్చారు మాదినేని లోకేష్. కడప జిల్లా చిట్వేలి నియోజకవర్గంలోని రాజుకుంట పంచాయతీ చింతలచేలిక స్కూల్లో శనివారం వంద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాదినేని లోకేష్ మాట్లాడుతూ చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే సత్ర్పవర్తన, అలవాట్లు, ఆసక్తి తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి , అగ్రికల్చర్ అసిస్టెంట్ శ్రీ రామ్ నాయక్,రాజుగారు, గ్రామ వాలంటీర్లు నరసింహ, నారాయణ మరియు పిల్లలు పాల్గొన్నారు.