ప్లాస్టిక్ కవర్లు జప్తు.. రూ.25వేలు జరిమాన
1 min readపల్లెవెలుగు వెబ్, కడప: కడప నగర మేయర్ సురేష్ బాబు ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం మున్సిపల్ అధికారులు పలు హోటళ్లను తనిఖీ చేశారు. క్లాక్ టవర్‌లో ఉన్న విజయ హోటల్, షాహిదర్బార హోటల్, రుచిత మరియు ఎస్ఎఫ్ వీధిలో ఉన్న రాఘవేంద్ర మెస్, కేఫ్ బహార్ హోటల్‌ను తనిఖీ చేయగా భారీగా ప్లాస్టిక్ కవర్లు ఉన్న గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. ఆయా హోటళ్లకు జరిమాన విధించగా .. మొత్తం రూ.25వేలు వసూలు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ సిటీ కృష్ణ, సింగ్ ప్లానింగ్ సెక్రటరీస్ శానిటేషన్ మరియు సెక్రటరీస్ మరియు 30 వ డివిజన్ కార్పొరేటర్ షఫీ, 29వ డివిజన్ కార్పొరేటర్ రిజ్వాన్ , 25 వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు