ప్లాస్టిక్ హఠావో .. కర్నూలు బచావో….
1 min readపల్లెవెలుగు వెబ్, కల్లూరు అర్బన్ : కర్నూలు నగరంలోని, పాణ్యం నియోజకవర్గం, కల్లూరు అర్బన్ చెన్నమ్మ సర్కిల్లో 11 డివిజన్ లోని సచివాలయాల సిబ్బంది, సంబందిత అధికారులు కలిసి శనివారం ప్లాస్టిక్ హఠావో – కర్నూలు బచావో కార్యక్రమం నిర్వహించారు. చెన్నమ్మ సర్కిలోని వ్యాపారులను సమీకరించి ప్లాస్టిక్ వస్తువుల వాడకం, ప్లాస్టిక్ కవర్లు, వాటి అనర్థాల గురించి వివరించి, మన కర్నూలు నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చి దిద్దే కార్యక్రమంలో మీరంతా పాలుపంచుకోవాలని కోరారు. స్వచ్ఛ కర్నూలు కు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర డిప్యూటీ కమిషనర్ పద్మావతి , పలు వార్డుల కార్పొరేటర్లు సాన శ్రీనివాసులు , మైతాపు నరసింహులు, నారాయణరెడ్డి ,కుమారి సాపూరు మాధురి ఇంకా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.