ప్లాస్టిక్ పర్యావరణానికి ప్రమాదం…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్లాస్టిక్ ను తగుల బె డితే డయాక్సిన్లు, ప్యూరాన్లు అనే క్యాన్సర్ కారక వాయువులు వెలువడుతున్నాయి,ప్లాస్టిక్ రసాయనగర్ధాలు, పర్యావరణ మార్పుల వల్ల భూసార క్షీణతకు గురవుతుంది,మానవాళితోపాటు ఇతర జీవుల మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకమని, ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వారవుతారని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈరోజు ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు నారా సంచులే ముద్దు అంటూ ప్లాస్టిక్ రహిత బ్యాగులను పంపిణీ చేశారు. డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్లాస్టిక్ ను నేరుగా లేదా చెత్తతో కలిపి కాల్చడం వల్ల డయాక్సిన్లు, ప్యూ రాన్లు అనే క్యాన్సర్ కారకవాయువులు వెలువడుతున్నాయని ప్లాస్టిక్ వ్యర్ధాలు, కుంటలు చెరువులు నదులు సముద్రాల్లోకి చేరుతున్నాయన్నారు.ప్లాస్టిక్ రసాయన వ్యర్ధాలు పర్యావరణ మార్పుల కారణంగా భారత్ ప్రధానంగా క్షీణితకు గురవుతుందని, కాలక్రమంలో మీరు వాయు కాలుష్యానికి తోడు రసాయన వ్యవసాయం, తవ్వకాలవంటి వంటి మానవ చర్యలతో భూసారం క్షీణిస్తోందన్నారు ఈ సందర్భంగా కెవి సుబ్బారెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కెవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పర్యావరణ ని కాపాడాలని కోరారు. ఈరోజు కల్లూరు మండలం దూపాడు గ్రామ పరిసర ప్రాంతంలోని కె వి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో డాక్టర్ శంకర్ శర్మ ప్లాస్టిక్ రహిత బ్యాగులను పంపిణీ చేస్తూ విద్యార్థులలో అవగాహన కల్పించారు.