PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వారంలో కేవ‌లం 3 గంట‌లే వీడియో గేమ్స్ ఆడాలి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : పిల్లలు ఆన్ లైన్ ఆడే వీడియో గేమ్స్ పై చైనా ఆంక్షలు విధించింది. 18 ఏళ్ల వ‌య‌సు లోపు పిల్లలు వారంలో మూడు గంట‌లు మాత్రమే గేమ్స్ ఆడేలా కొత్త నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. సెప్టంబ‌ర్ 1 నుంచి ప్రభుత్వ సెల‌వుదినాలు, వీకెండ్స్, శుక్రవారాలు మాత్రమే రాత్రి 8 గంట‌ల నుంచి 9 గంట‌ల వ‌ర‌కు గేమ్స్ ఆడేలా నిబంధ‌న తీసుకొచ్చింది. ఈ మేర‌కు నేష‌న‌ల్ ప్రెస్ అండ్ ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ ఉత్తర్వులు జారీ చేసింది. 2019లో విధించిన నిబంధ‌న‌ల ప్రకారం రోజుకు గంట‌న్నర‌, సెల‌వుదినాల్లో మూడు గంట‌లు ఆడుకునే అవ‌కాశం ఉండేది. ప్రస్తుత నిబంధ‌న‌ల ప్రకారం వారానికి మూడు గంట‌లు మాత్రమే అవ‌కాశం ఉంటుంది. ఈ నిబంధ‌న‌ల‌తో చైనా గేమింగ్ దిగ్గజం టెన్సెంట్ తో పాటు ఆలీబాబా.. మ‌రికొన్ని ఐటీ సంస్థలు భారీగా న‌ష్టపోతాయి.

About Author