క్రీడాకారులు వ్యక్తిగత నైపుణ్యాలతో రాణించాలి
1 min read-నగర మేయర్ బి. వై. రామయ్య -ఘనంగా ప్రారంభమైన జిల్లా రగ్బీ పోటీలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విద్యార్థులు వ్యక్తిగతమైన నైపుణ్యం తో రాణించాలని కర్నూల్ నగర మేయర్ బి.వై. రామయ్య వ్యాఖ్యానించారు.ఆదివారం స్థానిక కోల్స్ జూనియర్ కళాశాల మైదానంలో ఎన్లైట్ అగ్రికల్చరల్ కళాశాల సౌజన్యంతో ప్రారంభమైన రగ్బీ అండర్ -14 మరియు మహిళల పురుషుల పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం లో స్వచ్ఛందంగా విద్యార్థులు క్రీడారంగంలో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాల బాలికలను కరచాలనం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అగ్రికల్చర్ కళాశాల ఛైర్మన్ డాక్టర్ నజీర్ అహ్మద్, ప్రిన్సిపాల్ మని దీపిక, కోల్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సీమోన్, జిల్లా రగ్బీ అధ్యక్షులు గుడిపల్లి సురేందర్, కార్యదర్శి బి.రామాంజనేయులు, క్రీడా సంఘ ప్రతినిధులు దాసరి సుధీర్, టి.గంగాధర్, చిట్టి బాబు, నాగరత్నమయ్య పరుశ రాముడు, చిన్న సుంకన్న, నాగ శ్రీనివాసులు ,సువర్ణ, వంశీ కృష్ణ, సూభన్ బాషా, తదితరులు పాల్గొన్నారు.