క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలి
1 min readమంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని గొడవలు పడవద్దని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి సూచించారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థుల చేత గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఉండే క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సాహించడమే లక్ష్యంగా సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. అంతే కాకుండా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో- ఖో పోటిల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి కింద నియోజకవర్గ స్థాయి లో రూ 35 వేలు, జిల్లా స్థాయి లో రూ 60 వేలు, రాష్ట్ర స్థాయి లో రూ 5 లక్షలు, ద్వితీయ బహుమతి నియోజకవర్గ స్థాయి లో రూ 15 వేలు, జిల్లా స్థాయి లో రూ 30 వేలు, రాష్ట్ర స్థాయి లో రూ 3 లక్షలు, తృతీయ బహుమతి నియోజకవర్గ స్థాయి లో రూ 5 వేలు, జిల్లా స్థాయి లో రూ 10 వేలు, రాష్ట్ర స్థాయి లో రూ 2 లక్షలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నేటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 వ తేది వరకు పోటీలు కొనసాగుతాయన్నారు. అనంతరం కాగడాలను వెలిగించి, క్రీడా పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి బ్యాటింగ్ చేయగా డీఈవో రంగారెడ్డి బౌలింగ్ చేశారు అదే విధంగా ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి తో డీపీవో నాగరాజు నాయుడు స్పెషల్ ఆఫీసర్ నారయణ మూర్తి వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సహ పరిచారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు జి. భీమారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, పెట్రోలు బంక్ శీనన్న, తహసీల్దార్ చంద్ర శేఖర్, ఎస్ఐ వేణు గోపాల్ రాజ్, ఎంపిడివో మణిమంజరి, ఈవో నాగరాజు, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, సచివాలయ కో కన్వీనర్ రాఘవేంద్ర ఆచారి, ఉప సర్పంచ్ లు హోటల్ పరమేష్, వీరనాగప్ప, ఎంపీటీసీ వెంకటేష్ శెట్టి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హంపయ్య, సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
రాంపురం లో ఆడుదాం ఆంధ్ర : మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం లో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. క్రీడాకారులకు వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బసాపురం సర్పంచ్ రాఘవ రెడ్డి, మాధవరం ఎస్సై కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.