పేకాట ఆడుతూ.. పోలీసులకు చిక్కన బాలకృష్ణ పీఏ !
1 min readపల్లెవెలుగువెబ్ : బెంగళూరులోని ఓ బార్‌లో పేకాడుతూ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీ పోలీసులకు పట్టుబడ్డారు. కర్ణాటకలో ఏపి నేత ఒకరు బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్నారు. ఈ బార్ అండ్ రెస్టారెంట్‌లో పేకాట నిర్విఘ్నంగా నడుస్తోందన్న సమాచారం తెలుసుకున్న కర్ణాటక పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. పేకాటాడుతూ పట్టుబడిన వారిలో బాలయ్య పీఏతో పాటు వైసీపీ కన్వీనర్ శ్రీరామిరెడ్డి కూడా ఉన్నారు.