సర్వసభ్య సమావేశం..రచ్చ రచ్చ..
1 min read– సమస్యలు పరిష్కరించనందుకు కేక్
– పనులు మొదలు పెట్టక ముందే లక్షల్లో మింగేసి
– సర్పంచ్ అంటే వాలంటీర్లకు లెక్కే లేదు
– మాకు విలువ లేనప్పుడు సర్పంచులు ఎందుకు
– లక్షల్లో పనులు చేయిస్తున్నా నిధులు సున్నా
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం జరిగింది.ఈసమావేశం ప్రారంభం అయినప్పటి నుంచి రచ్చ రచ్చగా సాగింది.సమావేశం జరుగుతూ ఉండగా బైరాపురం సర్పంచ్ ఫణి భూషణ్ రెడ్డి కేకును కట్ చేయడానికి వేదిక వద్దకు తీసుకొని వచ్చారు.కేకును ఎందుకు కట్ చేయాలని అధికారులు అడగగా మాగ్రామంలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ సమీపంలో జలజీవన్ మిషన్ పైపులు వేయడానికి మా గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి రోడ్డుమీదికి ఇల్లు నిర్మించాలని గత సంవత్సరం కిందట అధికారులకు ఫిర్యాదు చేయగా మండల అధికారులు అందరూ వచ్చి కొలతలు వేయగా అతను ప్రభుత్వ రోడ్డుమీదికి ఇల్లు నిర్మించాడ ని తేలింది.అయినా ఇంతవరకు వాటిని తొలగించకపోవడం వల్ల అంతేకాకుండా మాకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించనందుకుగాను సమస్యలకు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయాలని నిర్ణయించుకున్నానని సర్పంచ్ ఫనిభూషణ్ రెడ్డి అందరి ఎదుట చెప్పారు.సర్వసభ్య సమావేశంలో కేక్ కట్ చేయకూడదని ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి సూచించారు.అంతలో సహకార సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి కలుగజేసుకొని నీకు సమస్యలు ఉన్న మాట వాస్తవమే కానీ నేను ఎంపీపీ మరియు సర్పంచులు అందరి సహకారం మీకు ఉంటుంది సమావేశం నుంచి ప్రజాప్రతినిధులు అందరం కూడా బాయ్ కాట్ చేద్దామని తులసి రెడ్డి అన్నారు.సర్పంచ్ అంటే వాలంటీర్లకు లెక్కే లేదని మమ్మల్ని గౌరవించినప్పుడు మేము సర్పంచులం ఎందుకని సర్పంచులు అన్నారు.ఈవిషయంపై పంచాయతీ కార్యదర్శి షఫీ అహ్మద్ కు మరియు మా గ్రామంలో రోడ్డుమీదికి ఇల్లు కట్టిన అతనిపైన ఏమి చర్యలు తీసుకోవడం లేదంటూ పంచాయతీ కార్యదర్శి పై సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అదే విధంగా మిగతా సర్పంచ్లు కూడా వాలంటీర్లపై ఫిర్యాదు చేశారు.తలముడిపి గ్రామంలో రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనులు చేపట్టకుండానే మూడు లక్షలకు పైగా డబ్బులు డ్రా చేసి మింగేశారని తలముడిపి గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్ డిఈ ఘని బాబును ఆయన ప్రశ్నించారు.డ్రా చేసిన డబ్బులను మీరు ఎన్ని రోజుల్లో కట్టిస్తారు అని సర్పంచ్ డిఈని అడగగా మే మొదటి వారం లోపల కట్టిస్తానని డిఈ సమాధానం ఇచ్చారు.మండలంలోని దేవనూరు వివిధ ప్రాంతాలలో మల్లికార్జున రిజర్వాయర్ ప్రాజెక్టు రావడం వల్ల గ్రామాల్లో వదలి పెట్టి పోవాల్సి వస్తుందంటూ గ్రామాల్లో వస్తున్న పుకార్లపై గ్రామ ప్రజలకు తెలపాలని పీరు సాహెబ్ పేట సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి తహసిల్దార్ తో చెప్పారు.కర్నూలు ఆర్టీసీ డిపో నుండి కడుమూరు గ్రామానికి వస్తున్న బస్సు మిడతూరుకు వచ్చే విధంగా చూడాలని అంతేకాకుండా ఎంపీడీవో కార్యాలయం నుంచి మిడుతూరు బస్టాండ్ వరకు రోడ్డు వేయాలని ప్రజాప్రతినిధులు అన్నారు.అంతేకాకుండా గ్రామాల్లో లక్షల కొద్ది రూపాయలు వెచ్చించి ఖర్చు చేస్తున్నా కూడా బిల్లులు మాత్రం రావడంలేదని సర్వసభ సమావేశంలో ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరేమో చేస్తాం చూస్తాం అని చెప్తారే తప్పా బిల్లులైతే రావడం లేదంటూ సర్పంచులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సర్పంచుల మాటను ఎవరెవరైతే వాలంటీర్లు లెక్కచేయడం లేదో వారి వివరాలు అందజేయాలని ఎంపీడీవో ప్రజా ప్రతినిధులను కోరారు.ఈకార్యక్రమంలో తహసీల్దార్ సిరాజుద్దీన్,వైస్ ఎంపీపీ నబి రసూల్,ఈవో ఆర్డీ ఫక్రుద్దీన్,ఏవో దశరథ రామయ్య,వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మరియు వివిధ శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.