NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్లస్ టు పాఠశాలలను కొనసాగించండి… ఆపస్ వినతి

1 min read

పల్లెవెలుగు వెబ్  ఒంగోలు: గత ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసిన (ఇంటర్మీడియట్) ప్లస్ టు పాఠశాలలను కొనసాగించేలా చూడాలని కోరుతూ ప్లస్ టు పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రావణ కుమార్ మాట్లాడుతూ ఉన్నత విద్యలో భాగంగా పాఠశాల విద్యలోనే ప్లస్ టు పాఠశాలలను కొనసాగించి ప్రస్తుతం పని చేస్తున్న వారిని యధావిధిగా కొనసాగించాలని,  అలాగే ప్రమోషన్ పద్ధతిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ప్లస్ టు పాఠశాలలకు అధ్యాపకుల నియామకం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్లస్ టు పాఠశాలలను ఇంటర్మీడియట్ విద్య కు అప్పగించి కాంటాక్ట్ లెక్చర్లను నియమించాలనుకోవడం సరికాదని ,ప్రస్తుతము ఉన్న ప్లస్ టు పాఠశాలల వ్యవస్థను యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి తెలియజేశారు. పదవ తరగతి విద్యార్థులకు నెలకు ఒక్క రోజు కూడా సెలవు లేకుండా రెండో శనివారం ఏడు పీరియడ్లు బోధించాలనడం సరికాదని, టీచర్లకు విద్యార్థులకు ఈ రెండు నెలల్లో వచ్చే రెండవ శనివారం పూర్తి సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ బలరామకృష్ణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి. దిలీప్ చక్రవర్తి ప్లస్ టు అధ్యాపకులు వి.మార్కండేయులు, యం.నాగ కుమార శర్మ, ఆర్.జగన్నాధ రావు, నాగ ప్రకాష్ ,కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

About Author