NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పిఎమ్ జే జ్యువెల్స్ ‘సీతార కలెక్షన్’ అవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ : వివంతా (ది గేట్ వే) హోటల్ వేదికగా  3 రోజుల వివాహ ఆభరణాల ప్రదర్శనలో భాగంగా గురువారం ‘జరిగిన విలేకరుల సమావేశంలోపిఎంజె జ్యువెల్స్ వివాహ ఆభరణాల సితార కలెక్షన్ ఆవిష్కరణ జరిగింది.దక్షిణ భారత్ లోనే అత్యంత ప్రియమైన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ పిఎమ్ జె జ్యూవెల్స్’ ఆధ్వర్యంలో వారు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పిఎమ్ జె సిగ్నేచర్ కలెక్షన్ “సితార” ను ముఖ్యఅతిథిగా విచ్చేసిన దేవినేని అనుపమ ఆవిష్కరించడంజరిగింది.    ఈ  సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె మాట్లాడుతూ వివాహ  ప్రదర్శన  పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహిస్తున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఎగ్జిబిషన్లో పి ఎం జె వారి సితార కలెక్షన్ ఆవిష్కరణలో తాను కూడా భాగం అవడం గౌరవంగాను సంతోషంగానే ఉందన్నారు. ‌.ప్రతి వివాహ జంటకు మధురమైన పెళ్లిరోజున అందం, నైపుణ్యం ,కలగలిసిన ఈ ఆభరణాలు వారికి, ఆనందంతో పాటు మధుర స్మృతులను అందిస్తాయని, ప్రగాఢంగా నమ్ముతున్నానని ఆమె అన్నారు. తదనానంతరం విజయవాడ స్టార్ హెడ్ మోహన్ కృష్ణ మాట్లాడుతూ నగరంలోని తమ కస్టమర్లకు సితార కలెక్షన్ ను పరిచయం చేయడం ఎంత ఆనందంగా ఉంది అన్నారు.   పిఎంజె జ్యువెల్స్  జూలై 13 నుంచి జూలై 15వ తేది వరకు అతిపెద్ద వివాహ ఆభరణాల ప్రదర్శన జరుగుతాయిని,సోషల్ సెలబ్రెటీగా అందరిని ఆకర్షిస్తున్న తార.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు అనిఅన్నారు.”సితార’ను పిఎమ్ జె జ్యువెల్స్ తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవలే ప్రకటించింది అన్నారు.  అనంతరం సౌత్ హెడ్ హైదర్ ఆలీ మాట్లాడుతూ  న్యూయార్క్ లోని ప్రతిష్టాత్మక టైమ్స్ స్క్వేర్ వేదికగా వారం రోజుల క్రితం ప్రారంభించిన సితార కలెక్షన్ న్ను ప్రస్తుతం విజయవాడలోని ఆభరణాల ప్రియుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా నెక్లెస్లు, చెవిపోగులు, గాజులు, ఉంగరాలు, పొల్కాతో పాటు నాణ్యమైన డైమండ్స్ తో అలంకరించిన ఆభరణాలు, విలువైన లోహాలతో రూపొందించబడిన అరుదైన ఆభరణాలు సిద్ధంగా ఉన్నాయి అని,  విజయవాడ వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ  అద్భుత ప్రయత్నం అభినందనీయం,. అన్నారు. ఈ కార్యక్రమంలో,టీఎంజె సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author