పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.. తేదీ ప్రకటించిన కేంద్రం
1 min readపల్లెవెలుగువెబ్ : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వార కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ఏటా రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బు జమచేస్తోంది. 2022 జనవరి 1న రైతుల ఖాతాల్లో డబ్బు జమచేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించి పదో విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. దేశ వ్యాప్తంగా 10 కోట్ల రైతలు ఖాతాల్లో 20 వేలకోట్ల నగదు జమచేయనున్నారు. అర్హులైన రైతులకు కేంద్రం ప్రతి ఏటా ఆరువేలు ఇస్తోంది. ఏడాదిలో మూడు విడతల్లో ఈ సహాయం అందిస్తున్నారు.