పీఎం కిసాన్ సమ్మేళన్ వెబ్ క్యాస్టింగ్
1 min readపల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె: మండలంలో యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం దృశ్యమాధ్యమం ద్వారా. నిర్వహించడం జరిగినది.ఆమె మాట్లాడుతూ ఈరోజు ప్రధానమంత్రి గారు పీఎం కిసాన్ పథకంలో భాగంగా, 2000 రూ. లను రైతుల ఖాతాలకు జమ చేయనున్నారు అని తెలిపారు. అదేవిధంగా అన్ని రకాల కంపెనీలకు చెందిన ఎరువులను ఒకే గొడుగు కిందకు తెస్తూ భారత్ బ్రాండ్ తో, భారత్ యూరియా, భారత్ DAP గా, అందించడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేశారు, దీనివల్ల ఎరువుల ధరలు తగ్గేదానికి అవకాశం ఉందని తెలియచేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా ఇన్చార్జ్ శ్రీనాథ్ రెడ్డి గారు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ సహజ వ్యవసాయానికి (నేచరల్ ఫార్మింగ్) కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తూ వస్తుందన్నారు, కనీసం 5 ఎకరాలు వున్న రైతు ఒక ఎకరమైన సహజ సిద్ధంగా పంటలు పండించి, నేలతో పాటు మనుషుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. అలాగే KVK శాస్త్రవెత్తలు ప్రకృతి వ్యవసాయం పై రైతులతో చర్చ కార్యక్రమం ఏర్పాటుచేసి రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్ కుమార్, కెవికె శాస్త్రవేత్తలు రమణయ్య, సుధాకర్, బాలరాజు, కృష్ణమూర్తి, ఆదినారాయణ, రవి గౌడ్, లక్ష్మీ ప్రియ మరియు రైతులు తదితరులుపాల్గొన్నారు.