PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIITDM కర్నూలు క్యాంపస్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కర్నూలు (IIITDM కర్నూలు) క్యాంపస్‌ను 20, ఫిబ్రవరి, 2024న జాతికి అంకితం చేయనున్నారు. AP పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (MoE) ద్వారా ఈ సంస్థను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జగన్నాథగట్టు కొండపై 151.51 ఎకరాల్లో ఈ క్యాంపస్‌ను నిర్మించారు. భారతీయ ఐటీ పరిశ్రమను బలోపేతం చేయడంలో మరియు దేశీయ ఐటీ మార్కెట్ వృద్ధికి దోహదపడటానికి ఈ కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ కీలక పాత్ర వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలకు కావలసిన సాంకేతికతలు మరియు సాంకేతిక నిపుణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని  ఈ  ఇన్స్టిట్యూషన్ ను స్థాపించడం జరిగింది.296.12 కోట్ల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో 16 తరగతి గదులు, 22 ప్రయోగశాలలు, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్, 3 సెమినార్ హాళ్లు, 4 హాస్టళ్లు, 2 మెస్ బ్లాక్‌లు, డైరెక్టర్ బంగ్లా, 20 ఫ్యాకల్టీ క్వార్టర్‌లు, 2 రెండు సబ్‌స్టేషన్లు, హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లతో పాటు 1260 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు క్యాంపస్ అభివృద్ధి చేయబడింది. అన్ని భవనాలు కొండ భూభాగాన్ని ఉపయోగించడం ద్వారా సహజ కాంతి మరియు వెంటిలేషన్‌తో చక్కగా రూపొందించబడ్డాయి. ఇన్స్టిట్యూషన్ కట్టడంలో  అన్ని నిబంధనలను  అత్యుత్తమ  ప్రామాణిక  కొలమానాలతో  నిర్మించడం వలన 5-నక్షత్రాల GRIHA ధృవీకరణను పొందింది.IIITDM కర్నూలు క్యాంపస్‌ లో మొత్తం 907 మంది విద్యార్థులు 4 అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు, 6 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు మరియు Ph.D ప్రోగ్రామ్‌ల లో చదువుతున్నారు. విద్యార్థుల దేశీయంగా సగటు CTC రూ. 7.522 లక్షలు ప్యాకేజీ, రూ. 30 లక్షలు గరిష్ట ప్యాకేజీ మరియు అంతర్జాతీయంగా అత్యధికంగా 1.3 కోట్ల ప్యాకేజీ సాధించడం తో  ఈ ఇన్స్టిట్యూషన్ ఉత్తమ సంస్థగా నిలిచింది.  ఇన్‌స్టిట్యూట్‌లో 40 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ, 10 మంది అనుబంధ ఫ్యాకల్టీ, 1 ప్రొఫెసర్ ప్రాక్టీస్, 19 మంది రెగ్యులర్ నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు ఔట్‌సోర్సింగ్ మరియు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం 843.56 లక్షల రూపాయల విలువైన అనేక పరిశోధన ప్రాజెక్టులను అమలు చేస్తోంది, దీనితో పాటుగా 14 పేటెంట్ల ఇన్‌స్టిట్యూట్‌ కు మంజూరు అయినవి,  ప్రసిద్ధిగాంచిన 12 రకాల  పరిశ్రమలు  మరియు  విద్యాసంస్థలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. వీటితో పాటుగా  ప్రఖ్యాతిగాంచిన జర్నల్స్/కాన్ఫరెన్స్‌లలో 263 పేపర్‌లను ఇన్స్టిట్యూట్ లోని  ఫ్యాకల్టీ మరియు విద్యార్థులు  ప్రచురించారు. ప్రస్తుత పరిశ్రమ సంబంధిత డొమైన్‌ల సవాళ్లను పరిష్కరించడానికి 5G యూజ్-కేస్, IoT, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్‌లు, రోబోటిక్‌ల ల్యాబ్‌లను కూడా ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసింది. అదనంగా, AI, ML, IoT మరియు బిగ్ డేటా అనలిటిక్స్‌పై నైపుణ్యాన్ని అందించడానికి ప్రముఖ  ఎలక్ట్రానిక్  దిగ్గజ కంపెనీ  Samsung వారి సౌజన్యంతో ఇన్నోవేషన్ క్యాంపస్ ల్యాబ్‌ను కూడా ఇన్స్టిట్యూట్  లోపల  ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి   శ్రీ YS జగన్మోహన్ రెడ్డి,  కేంద్ర విద్యా శాఖ మంత్రి  శ్రీ ధర్మేంద్ర ప్రధాన్,  శ్రీ  అంజద్ భాష,  డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆంధ్ర ప్రదేశ్,  డాక్టర్  సంజీవ్ కుమార్,  మెంబర్ అఫ్ పార్లమెంట్,  లోక్ సభ, చైర్మన్ HA Prof. రంగనాథ్,  డైరెక్టర్ Prof. DVLN సోమయాజులు, రిజిస్టార్  గురుమూర్తి ల తో పాటు  ఫ్యాకల్టీ, సిబ్బంది మరియు విద్యార్థులు  పాల్గొననున్నారు.

About Author