PMJ జువేల్స్ వారి నూతన షోరూం ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు : దక్షిణ భారత దేశంలో పేరుగాంచిన అత్యంత అభిమాన ఉత్తమ జ్యువెలరీ బ్రాండ్ PMJ జువేల్స్ వారు తమ ప్రతిష్టాత్మకమైన నూతన షోరూం ను ఈరోజు కర్నూలు నగరంలోని జ్యోతి మాల్ ఎదుట, మేడం కాంపౌండ్ నందు ప్రారంభించారు. ఈ నూతన షోరూం ను శ్రీమతి SV. విజయ మనోహరి, KDCC చైర్మన్, కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ శ్రీ BY. రామయ్య, డిప్యూటి మేయర్ ఎస్.రేణుక PMJ బిజినెస్ హెడ్ శ్రీ రాంరెడ్డి మరియు PMJ జువేల్స్ కర్నూలు షోరూం హెడ్ శ్రీ రంగారెడ్డి గార్లతో కలిసి ఆవిష్కరించారు. దక్షిణ భారత దేశంలో ఇది తమ 30వ షోరూం అని యాజమాన్య పేర్కొన్నాది. ఈ సందర్భంగా 22 సెప్టెంబర్ నుంచి 27 సెప్టెంబర్వరకు ప్రత్యేకంగా వివాహ శుభకార్యాలకు అవసరమైన అద్భుతమైన ఆభరణాల ప్రదర్శనను విస్తృత శ్రేణిలో ఏర్పాటుచేశారు. శ్రీమతి SV. విజయ మనోహరి, KDCC చైర్మన్, మాట్లాడుతూ ఈ నూతన షోరూం నగరానికి కొత్త సొగసులు చేకూర్చటమే కాక నగర వాసులకు కావలసిన ప్రపంచ శ్రేణి అద్భుత ఆభరణాలు అందించే గమ్యస్థానం అవుతుంది అన్నారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా నగర మేయర్ శ్రీ రామయ్య మాట్లాడుతూ ” ఇంట విశిష్టమైన ఆభరణాల షోరూం ఆవిష్కరణలో తాను పాలుపంచుకోవటం ఆనందంగా ఉందని, PMJ జువేల్స్ బృందానికి అభినందనలు తెలిపారు. ఈ PMJ జువెల్స్ మన నగరానికి సరికొత్త అందాలు తేవటమే కాక మన నగర శ్రేయస్సుకు దోహద పడుతుందని ఆశిస్తున్నానని, ఆ విజయోత్సం. చూసేందుకు తానూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు . కర్నూలు నగరంలో తమ PMJ జువెల్స్ ప్రారంభించటం తమకు ఎంతో సంతోషంగా ఉందని, నైపున్యతలో రాజీలేని అద్భుతమైన, అసాధారణమైన మరియు ఖాతాదారుల అనుభూతికి అనువైన ఆభరణాలను అందించాలనే ల్కట్టుబాటుతో ఈ షోరూం ప్రారంభించమని మరియు కర్నూలు సామాజిక రంగంలో తాము భాగస్తులు కావాలని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా మాట్లాడిన PMJ జువెల్సిజినెస్ హెడ్ శ్రీ రామ్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా కర్నూలు PMJ షోరూం హెడ్ మాట్లాడుతూ, ఖాతాదారుల అవసరాలకు మరియు అనుభూతులకు అనుగుణమైన విభిన్న రకాల ఆభరణాలను తమ కర్నూలు షోరూం అందిస్తుంది అన్నారు. తమ షోరూం నందు అడుగు పెట్టిన ప్రతి ఖాతాదారును సంతృప్తి పరచుటకు మరియు షాపింగ్ చేయుటలో గొప్ప అనుభుతిని కలిగించుటకు అంకిత భావంతో కృషి చేస్తాము అన్నారు.కర్నూలు నగరంలోని PMJ జువెల్స్ షోరూం ప్రాచీన సాంప్రదాయ మరియు ఆధునిక మరియు బైస్పోక్ ప్రత్యేక సేకరణలు విస్తృతంగా అందిస్తూ ఆభరణాల అభిమానులకు అత్యంత చేరువవుతుంది. ఈ షోరూం నందు అద్భుతంగా రూపొందిన బంగారు, వజ్రాలు, పోల్కా మరియు రత్నాల ఆభరణాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఖాతాదారులు బ్రాండు విశిష్టతను, వారసత్వ నిబద్ధతను, నైపుణ్యతను మరియు విభిన్నమైన విస్తృత డిజైన్స్ ను ప్రత్యక్షంగా చూడ వచ్చును. PMJ జువెల్స్ అంటే విశ్వాసానికి, సమగ్రమైన విలువలకు కట్టుబడి ఉంటుంది ఆభరణాల సృష్టించుటలో దశాబ్దాలుగా బ్రాండు వారసత్వం కొనసాగుతున్నాది. ఇవి కేవలం అలకరణ మాత్రమే కాక జీవిత మధుర క్షణాలను చిరస్మరణీయం చేస్తాయి.