పి యం జె జె బి వై ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ
1 min read
పంపిణీ చేసిన పసుపుల కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పుష్పాంజలి.( మేనేజర్ కె రఘురామ్)
కర్నూలు, న్యూస్ నేడు: కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పుష్పాంజలి మేడమ్ మాట్లాడుతూ కర్నూలు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన మాషపోగు మద్దిలేటి అనారోగ్యం కారణంగా చనిపోవడం జరిగింది.ఆయనకు పి యం జె జె బి వై ఇన్స్యూరెన్స్ 436/- ప్రీమియం కట్టినందువలన ఆయనకు నామిని అయిన ఆయన భార్య మాషపోగు నాగమ్మ అకౌంట్ కు 2 లక్షల ఇన్స్యూరెన్స్ అమౌంట్ జమ కావడం జరిగింది. ఈ అమౌంట్ తో వారు ఏదైనా వ్యాపారం చేసుకొని వాటి ద్వారా కుటుంబ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది.అర్హత గల వారు అందరూ పి యం జె జె బి వై, పి యం యస్ బి వై ఇన్స్యూరెన్స్ చేయించు కోవాలి అని తెలియజేయడం జరిగింది. ఈ ఇన్స్యూరెన్స్ అమౌంట్ తో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ కుటుంబ అభివృద్ది కి ఉపయోగించుకుంటానని,ఇన్స్యూరెన్స్ అమౌంట్ తెప్పించిన బ్యాంక్ మేనేజర్ రఘురామ్ కి ఆమె కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.అలాగే మా గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ భీమా అమౌంట్ గురించి మాకు తెలియజేసి, అమౌంట్ రావడానికి సహకరించిన ఎస్.ఎస్.టి,సి ఎఫ్ ఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ వి.ఆంజనేయులు సార్ కి,ప్రాజెక్టు మేనేజర్ వి.అశోక్ కుమార్ కి కౌన్సిలర్లు టి. నరసింహ, బి.రామాంజనేయులు, జె. శ్రీనివాసులు మరియు వీబికే ఆంజనేయులు కు కృతజ్ఞతలు తెలిపారు.