PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తండ్రిని కోల్పోయిన విద్యార్థినికి పొచిమి రెడ్డి ఆర్థిక చేయూత   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: అనారోగ్యంతో తండ్రిని కోల్పోయి తండ్రిని కోల్పోయిన విద్యార్థినికి పోచిమి రెడ్డి సేవాదళ్ సంస్థ ఆర్థిక సాయం అందించింది. పోచిమిరెడ్డి సేవాదళ్ నందు కుట్టు ఉచిత  శిక్షణ , ఉచిత కుట్టు మిషన్ తీసుకుని స్వయం భృతి కల్పించుకుని జీవనం సాగించే చాంద్ బీ భర్త పెద్దయ్య కొద్దికాలం క్రితం అనారోగ్యం తో  మరణించాడు .ఈమె కూతురు షబానా భాను  అగ్రికల్చర్ డిప్లొమా 2 వ సంవత్సరం రెడ్డిపల్లి హాస్టల్ నందు వుంటూ,  చదువుతూ వుంది. హాస్టల్ మెస్ బిల్ కట్టలేక పోవడం తో శ్రీ పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి విషయం తెలుసుకుని భరోసా ఇచ్చి ప్రతి నెల మెస్ బిల్ పోచిమిరెడ్డి సేవాదళ్ అందిస్తుందని, అధైర్య పడవద్దని , భవిష్యత్తు పై దృష్టి పెట్టి బాగా చదుకోవాలని సూచించారు. తక్షణం ఆర్థిక సాయం కింద  10000 రూ లు. అందజేశారు . ఈ కార్యక్రమం లో వార్డ్ మెంబర్ బోడా సావిత్రి , ఎంపీటీసీ అనిత , కే . గోవింద రాజు , ట్యూటర్స్ జయమ్మ ,రమాదేవి , బోడా శ్రీను పాల్గొన్నారు.

About Author