మృతుని కుటుంబానికి పోచిమి రెడ్డి సేవాదళ్ ఆర్థిక చేయూత
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణం కుమ్మరి వీధికి చెందిన విజయ్ కృష్ణ మృతుని కుటుంబానికి పోచిమి రెడ్డి సేవాధల్ వ్యవస్థాపకులు మురళీధర్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. బుధవారం అనారోగ్యంతో మృతి చెందిన విజయకృష్ణ మృతదేహానికి పూలమాలలు వేసి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడు పోచిమిరెడ్డి సేవాదళ్ నందు సభ్యుడు అయినందున మురళీధర్ రెడ్డి మృతుని దహన సంస్కారాలకు గాను ఐదువేల రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుని కుటుంబానికి కోచింగ్ రెడ్డి సేవాదళ్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు మెంబర్ కుమ్మరి వరలక్ష్మి, ఎంపీటీసీ అనిత, వార్డ్ మెంబర్ నాగరాజు, మాజీ ఉపసర్పంచ్ కోటేశ్వరరావు, గోవిందరాజు, బసన్న సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.