గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించిన పోచిమి రెడ్డి సేవాదళ్
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: స్కానింగ్ కోసం ప్రతి నెల 9వ తేదీ పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు స్థానిక పోచిమి రెడ్డి సేవాదళ్ పౌష్టిగా ఆహారo అందజేసింది. కోచింగ్ రెడ్డి సేవాదళ్ సంస్థ ఉదార భావంతో ప్రతి నెల స్కానింగ్ కొరకు స్థానిక ప్రభుత్వ ఆసపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేస్తున్నది. పత్తికొండ చుట్టు పక్కల గ్రామాల నుండి స్కానింగ్ కొరకు పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో గర్భిణీ స్త్రీలు వస్తుంటారు. వారి సౌకర్యార్థం, గర్భిణీ స్త్రీలకు, వారి సహాయకులకు పౌష్టిక ఆహార వసతి ఏర్పాటు చేసినట్లు పోచిమిరెడ్డి సేవాదళ్ సంస్థ వ్యవస్థాపకులు పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కల్పన గారు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు దేవరగట్టు లక్ష్మి, నెనావత్ సరోజ, వార్డు మెంబర్ లు బోడ సావిత్రి లైట్ నాగరాజు, మాజీ ఉపసర్పంచ్ కే. కోటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ గణపతి, పోచిమిరెడ్డి సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.