NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాధిత కుటుంబాలను పరామర్శించిన ‘పోచిమి రెడ్డి’  

1 min read

పల్లెవెలుగు, పత్తికొండ: ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడమే పోచిమి రెడ్డి సేవాదళ్ ప్రధాన లక్ష్యమని పోచిమి రెడ్డి మురళీధర్ రెడ్డి స్పష్టం చేశారు.ఇటీవల మరణించిన సేవాదళ్ కుటుంబ సభ్యుడు ఫక్కుమియా దర్గా ముజావర్ బుజ్జులు  కుటుంబసభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించి, బాధిత కుటుంబానికి 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఇకపై సేవాదళ్ సభ్యులుగా కార్డు కలిగిన కుటుంబ సభ్యులలో ఎవరు మరణించి నా తక్షణం దహన సంస్కార ఖర్చులకు గాను 5 వేల రూపాయలు అందజేస్తామని ఆయన ప్రకటించారు. అనంతరం ప్రమాదానికి గురైన ముస్లిం వీధికి చెందిన కొలిమి షేక్షావలిని పోచం రెడ్డి మురళీధర్ రెడ్డి కలిసి పరామర్శించారు. అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అన్నివేళలా తన సహాయ సహకారాలు ఉంటాయని వారికి ఆయన భరోసా ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన కోచింగ్ రెడ్డి సేవాదళ్ సభ్యులు ఎలాంటి కష్టం వచ్చినా తమను సంప్రదించాలని కోరారు. నిన్నటి దినం యాక్సిడెంట్ కు గురి అయ్యారని తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ప్రమాద ఘటనను అడిగి తెలుసుకున్నారు.

About Author