కవియిత్రి మొల్ల జయంతి వేడుకలు…
1 min read
ఘనంగా నివాళులు అర్పించిన బీసీ నాయకులు
ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైసీపీ ఏలూరు ఇన్చార్జ్ జయప్రకాష్ (జెపి)
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏలూరు పార్టీ కార్యాలయంలో కవియిత్రి మొల్ల జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నెరుసు చిరంజీవులు నగర బీసీ సెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, ఆధ్వర్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ (జె పి) హాజరయ్యారు. కవియిత్రి కుమ్మరి మొల్ల రచనల ద్వారా సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. రామాయణాన్ని అతి సులువైన పదాలతో తెలుగులో రచించి తన సరళమైన పదజాలానికి అందరూ ముద్దులయ్యేలా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు రాజేష్, నగర ఆర్టిఐ విభాగ అధ్యక్షులు ఫణి, యూత్ నాయకులు వెంకటేష్, రాష్ట్ర మైనార్టీ నాయకులు గాజుల బాజీ, ట్రేడ్ యూనియన్ విభాగ అధ్యక్షులు శివ, పార్టీ సీనియర్ నాయకులు మల్లిక్, స్వామి, శంకర్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.