NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కవులు.. మార్గదర్శకులు

1 min read

– పుస్తక ఆవిష్కరణ సభలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష
పల్లెవెలుగు వెబ్​, కడప బ్యూరో: ఉర్దూ కవితల పుస్తకాల ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మాత్యులు ఎస్ బి.అంజాద్ భాష పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని సాహిద్ బాన్కెట్ హాల్ లో బజమే ఏ జావేద్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉర్దూ కవితల పుస్తకాలు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష పాల్గొని ప్రసంగించారు. ఇటువంటి మంచి కార్యక్రమా లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బజమ్ ఏ జావేద్ ఆర్గనైజేషన్ కడప జిల్లా అధ్యక్షులు, ఎస్ వి యూనివర్సిటీ ఉర్దూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ రిటైర్డ్ రిజిస్ట్రార్ ఎస్ ఏ.సత్తార్ మాట్లాడుతూ నగరంలో వివిధ కాలేజీల లో చదివిన విద్యార్థిని, విద్యార్థులకు సర్టిఫికెట్ లు, మెమెంటోలు అందజేయడం జరిగిందన్నారు. అనంతరం కవులకు ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది. మధ్యాహ్నం అనంతరం కవి సమ్మేళనం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ లు కాసిం అలీ ఖాన్, జిమ్ సద్ అలీ ఖాన్, సముయుద్దీన్, ముజమీన్, కార్పొరేటర్ షఫీ, షాహి దర్బార్ హోటల్ ప్రొప్రైటర్ అజాం, ఉర్దూ ప్రముఖులు, విద్యార్థులు, కవులు తదితరులు పాల్గొన్నారు.

About Author