PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేపర్ గ్లాసుల్లో విషం. కొని తెచ్చుకుంటున్న అనారోగ్యం..

1 min read

– క్యాన్సర్ పొంచి ఉంది జాగ్రత్త…
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గతంలో టీ తాగాలంటే గాజు గ్లాసుల్లో ప్లాస్టిక్ గ్లాసులు వాడకం ఎక్కువ ఉండేది రాను రాను ఆధునిక అలవాట్లలో భాగంగా పర్యావరణానికి హాని కలిగిస్తాయని నేపంతో ప్లాస్టిక్ గ్లాసులు బ్యాన్ చేయడంతో కొత్తగా టీ స్టాల్ లో పేపర్ గ్లాసుల వాడకం ఎక్కువైంది పర్యావరణానికి హాని కలుగుతుందని నేపంతో బ్యాన్ చేసిన ఏకంగా మనిషికే పేపర్ గ్లాసులు స్పాట్ పెట్టడం మొదలుపెట్టాయి తెలిసో తెలియకో చేస్తున్న పేపర్ గ్లాసుల ఉపయోగం వల్ల డబ్బులు ఇచ్చి మరి అనారోగ్యాన్ని కొనుకుంటున్నట్టు పేపర్ గ్లాస్ వద్దు గాజు గ్లాస్ ముద్దు అంటూ పాత సంప్రదాయానికి డిమాండ్ పెరిగింది అసలు ఇంతకు పేపర్ గ్లాసులో ఏముంటున్నది అనేది శాస్త్రవేత్తలు కులంకుశంగా వివరించారు.డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో టీ తాగడం వల్ల మనకి తెలియకుండానే ప్లాస్టిక్ కణాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, ఈ ముప్పు రెండు విధాలుగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారి వాడి పడేసే వీలుండటంతో ప్లాస్టిక్ గ్లాసులకు ఆదరణ పెరిగింది. కానీ ఈ కప్పులోనే మనకు తెలియని విషం ఉంది. ఈ కప్పులపై తరచుగా సూక్ష్మక్రిములు తిష్టవేసి ఉంటాయని, నోటి లాలాజలాల ద్వారా లోపలికి వెళ్లిపోతాయని అంటున్నారు. ప్లాస్టిక్ కప్పుల్లో లోపల ఓ లైనింగ్ ఉంటుంది. ఈ లైనింగ్ కారణంగా కప్ వాటర్ ప్రూఫ్ లా పనిచేస్తుంది. దీంట్లోని రసాయనాలు పర్యావరణంతోపాటు మనిషి ఆరోగ్యానికి సైతం పలు విధాలా హాని చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాకుండా పేపర్ గ్లాసులో వేడి వేడి టీ తాగడం వల్ల అందులో పల్చటి పొర కరిగి దాని ద్వారా పెల్లాడియం, క్రోమియం, కాడ్మియం అనే విష పదార్థాలు లోపలికి ప్రవేశిస్తాయి. ఈ ప్లాస్టిక్ కప్పులలో టీ తాగడం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు.ఫ్లోరోక్టానోయిక్ అనేది ప్యాకేజింగ్ పేపర్​, బ్యాగ్ ల నుండి ఆహారంలోకి చేరుతుంది. ఆహారం వేడి , నూనెగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ కారకాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగడం, ఇమ్యునోలాజికల్ పనితీరు, సంతానోత్పత్తిని తగ్గటం, జీవక్రియ, ఊబకాయం పెరిగే ప్రమాదం, జంతువులలో అనేక ప్రతికూల ఆరోగ్య పరిణామాలకు కారణమవుతుంది. ఈ అధ్యయనాల ప్రకారం పేపర్​తో చేసిన వస్తువులకంటే వెదురుతో చేసిన వస్తువులను వాడటం మంచిదని సూచిస్తున్నారు.. పేపర్ గ్లాసులు ఉపయోగిస్తున్న ప్రజలు జర జాగ్రత్త.

About Author