కల్లులో విషం కలిసింది.. !
1 min readపల్లెవెలుగువెబ్ : తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో కల్తీ కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడికి కాకినాడ జీజీహెచ్లో చికిత్సను అందిస్తున్నారు. లోదొడ్డిలో కల్తీ కల్లు తాగిన ఐదుగురులో నలుగురు మృతి చెందటంతో గ్రామంలో విషాద చాయలు నెలకొంది. జీలుగు కల్లులో విషం కలిసినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించామని రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో జీలుగు కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతి చెందారన్నారు. కల్లులో విషం ఎలా కలిసిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.