PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేకాట జూదరులు అరెస్టు

1 min read

– 1,18,230/- నగదు, 10 మోటార్ సైకిల్లు,6 సెల్ ఫోన్లు, 45 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు స్వాధీనం.
– 15 రోజుల రిమాండ్ కు తరలింపు.
పల్లెవెలుగు వెబ్ తుగ్గలి: 12. 02.2023 వ తేదీ సాయంత్రము 5 గంటల ప్రాంతంలో తుగ్గలి మండలం గిరిగెట్ల గ్రామా ఊరి బయట గల వంకలో పేకాట ఆడుతున్నారని రాజశ్రీ కర్నూలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గారికి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వులపై తుగ్గలి పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి.మల్లికార్జున మరియు అతని సిబ్బంది తో పై ప్రాంతంలో దాడులు నిర్వహించారు.అక్కడ నీలి నవీన్ కుమార్, గొల్ల రంగస్వామి, బోయ వీరాంజనేయులు, ఖమ్మ మల్లికార్జున, బోయ హనుమంతు, గొల్ల రామాంజనేయులు అను 6 గురిని పట్టుకున్నారు.వారి వద్దనుండి 1,18,230/- నగదు, 10 మోటార్ సైకిల్లు, 6 సెల్ ఫోన్లు మరియు వారి వద్ద నుండి 45 కర్ణాటక రాష్ట్రం నకు చెందిన 90 ml టెట్రా ప్యాకెట్లను అదుపులోనికి తీసుకోవడమైనది.పై ఆరుగురుని విచారించగా జొన్నగిరి గ్రామానికి చెందిన బోయ శ్రీనివాసులు అనే వ్యక్తి ప్రతి వ్యక్తి వద్ద నుండి వెయ్యి రూపాయలు నగదు సేకరించి వారితో పేకాట ఆడిపిస్తున్నట్లు ఒప్పుకోవడం జరిగినది. అలాగే హబీబ్ భాషా, మహమ్మద్, హనుమన్న, సుధాకర్, హరీష్, ఆంజనేయులు మరికొంతమంది అక్కడినుండి పారిపోగా పై వారిపై తుగ్గలి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు.అదుపులో ఉన్న 6 మంది వ్యక్తులను రిమాండ్ కు పంపగా పత్తికొండ మేజిస్ట్రేట్ వారు ముద్దాయిలకు 27.02.2023 వరకు రిమాండ్ విదించడమైనది.

About Author