శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న పోలవరం ఎమ్మెల్యే
1 min read
స్వామివారికి ప్రత్యేక పూజలు,పోటెత్తిన భక్తులు
కార్యనిర్వహణాధికారి ఆర్.వి చందన
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : శ్రీ మద్ది ఆంజనేయస్వామివారిని దర్శించుకున్న పోలవరం శాసనసబ్యులు చిర్రి బాలరాజుగురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారిని ఈరోజు పోలవరం శాసనసబ్యులు చిర్రి బాలరాజు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయమునకు విచ్చేసిన వారిని అర్చకులు, కార్యనిర్వహణాధికారిణి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామివారి ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేశారు.అనంతరం ఆలయ మండపం వద్ద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్త్రము, ప్రసాదములు అందజేశారని ఆలయ కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలిపారు.