పోలవరం కుడి కాలువ వద్ద అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు..
1 min readఅడ్డుకున్న టిడిపి నాయకులపై వైసిపి అల్లరి మూకలు దాడులు..
ఏలూరు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ ప్రతినిధుల బృందం
మేము హద్దు దాటితే పరిస్ధితులు తీవ్రంగా ఉంటాయి ఖబడ్దార్..
చింతమనేని ప్రభాకర్ హెచ్చరిక
అక్రమాలకు వేదికగా మార్చుకున్న దెందులూరు వైసిపి నాయకులు
ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు
వైసిపి నీచమైన దాడులకు పాల్పడింది అధికారులు సరైన చర్యలు తీసుకోవాలి
ఏలూరు ఇంచార్జ్ బడేటి చంటి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం పోలవరం కుడి కెనాల్ వద్ద నిన్న అర్ధరాత్రి జరుగుతున్న గ్రావెల్ అక్రమ త్రవ్వకాలను అడ్డుకున్న టిడిపి నాయకులపై వైసిపి అరాచక మూకలు భౌతిక దాడులకు దిగటం పై చర్యలు కోరుతూ ఏలూరు కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ని కలిసిన జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఇంచార్జ్ బడేటి చంటి సహా పలువురు టిడిపి నాయకుల బృందం వినతిపత్రం అందచేశారు.ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ “అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు అడ్డుకున్నామనే అక్కసుతోనే స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో వైసిపి అరాచక మూకలు తమ నాయకులపై దాడులు చేశారని, ఇలాంటి ఉడుత ఊపుళ్ళకు టిడిపి జనసేన పార్టీలు భయపడవని, ప్రతి దాడులకు తాము దిగితే పరిస్థితి మరోలా ఉండేదని, కేవలం చట్టాన్ని గౌరవించి, సంస్కారం అడ్డు వచ్చి ఊరుకున్నామని, కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులను, ప్రజల సొమ్ములను వైసిపి నాయకులు కొల్లగొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని, హెచ్చరించారు.జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ “అనుమతుల పేరుతో దెందులూరులో వైసిపి నాయకులు భారీగా అక్రమ త్రవ్వకాలు చేస్తున్నారని, వైసిపి కి తుది దశ దగ్గర పడిందని అన్నారు. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన జగన్ ని ఆదర్శంగా తీసుకున్న దెందులూరు వైసిపి నాయకులు, సీఎం సభను సైతం తమ అక్రమాలకు వేదికగా మార్చుకున్నారని, మాటకు మాట చేతకు చేత అప్పచెబుతాం అని అన్నారు. ఏలూరు ఇంచార్జ్ బడేటి చంటి మాట్లాడుతూ,దెందులూరు లో వైసిపి నాయకులు యధేచ్చగా అక్రమ త్రవ్వకాలు చేస్తున్నారని, అడ్డుకుంటే నీచమైన దాడులకు దిగుతున్నారని, ఇకనైనా అధికారులు అడ్డుకోక పోతే చర్యకు ప్రతి చర్యలు ఎలా ఉంటాయో చూపిస్తాం” అని అన్నారు.