సారా బెల్లం ఊట బట్టీపై పోలీసుల దాడి
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో నాటు సారాపై పోలీసులు దాడి చేసినట్లు ఎస్సై జగన్ మోహన్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు నాగలూటి-దామగట్ల గ్రామాల మధ్యలో మ.3 గంటలకు పొలంలో సారాయిని తయారు చేస్తున్న బట్టీ దగ్గర 200 లీటర్లు(12 నీళ్ల బిందెల్లో)ఉన్న సారాయిని ఎస్ఐ సుబ్బయ్య కానిస్టేబుల్ శ్రీనివాసులు వాటిని కర్రలతో ధ్వంసం చేశారు.అదేవిధంగా వాటిని సారాయిని తయారు చేసే బెల్లం ఊట 20 లీటర్లను సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.పోలీసులు వస్తుండటాన్ని చూసిన వడ్డే నాగేంద్ర పరార్ అయ్యాడని ఆయనపై కేసు నమోదు చేసినట్లు తర్వాత అతని అదుపులోకి తీసుకుంటామని ఎస్సై తెలిపారు.ఎవరైనా సరే సారాయి బెల్ట్ షాపులు నిర్వహిస్తే చుట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై అన్నారు.