న్యాయవాదులపై పోలీసుల దాడి అమానుషం..
1 min read– ఏలూరు బార అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు : టి శశిధర్ రెడ్డి,చింతమనేని రమేష్
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : న్యాయవాదుల విధుల బహిష్కరణ – నిరసన హిందూపూర్,పల్నాడు ప్రాంతాలలో న్యాయవాదులపై పోలీసుల దాడిని ఖండిస్తూ ఏలూరు బార్ అసోసియేషన్ సోమవారం నిరసన వ్యక్తం చేసింది.ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి. శశిధర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి చింతమనేని రమేష్ ల ఆధ్వర్యంలో ఏలూరు న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించారు. అనంతరం బార్ అసోసియేషన్ హాల్ ముందు నిరసన వ్యక్తం చేశారు.న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి..న్యాయవాదులను అవమానపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలఅంటూ న్యాయవాదులు నినాదాలు చేశారు.హిందూపూర్,పల్నాడు ప్రాంతాలలో కమిషన్ పనిమీద వెళ్లిన న్యాయవాదులను అవమానపరిచి,దాడి చేయటం అమానుషమని ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టీ. శశిధర్ రెడ్డి, చింతమనేని రమేష్ లు ఆవేదన వ్యక్తం చేశారు. హిందూపూర్ లో న్యాయవాదులు ఉదయ్, రాఖీబులపై పోలీసులు దాడి చేశారని పేర్కొన్నారు.వృత్తి లో భాగంగా కమిషన్ పనిలో ఉన్న న్యాయవాదులపై పోలీసుల దాడి అమానుష్మని ఆవేదన వ్యక్తం చేశారు.న్యాయవాదుల సమస్యల పైన అందరూ ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. న్యాయవాదుల సమస్యల పరిష్కరించడంలో ఏలూరు బార్ అసోసియేషన్ ముందుంటుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గుంటూరు బాబు గణేష్,తీగిరిపల్లి సుబ్బారావు, గేద విజయభాస్కర్, కోన కృష్ణారావు,పేకేటి సత్యనారాయణ,జి లక్ష్మయ్య, ముంత సురేష్, కట్టా సత్యనారాయణ,కల్లేపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.