NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ నేతలను పోలీసులు ఎందుకు కొట్టారో సమాధానం చెప్పాలి

1 min read

కర్నూలు టీడీపీ అభ్యర్థి టిజి భరత్

  • కార్పొరేటర్, మరో ఇద్దరు నేతలను కౌన్సిలింగ్‌కు పిలిచి కొట్టారని మండిపడ్డ టీజీ భరత్

కర్నూలు, పల్లెవెలుగు: తమ పార్టీ 8వ వార్డు కార్పొరేటర్ పరమేశ్‌, సీనియర్ నేత శేషగిరి శెట్టితో పాటు మరొకరిని పోలీసులు కౌన్సిలింగ్‌కు పిలిచి ఎందుకు కొట్టారో చెప్పాలని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ డిమాండ్ చేశారు. కౌన్సిలింగ్‌ పేరుతో పోలీసులు ఫోన్ చేసి దారుణంగా కొట్టారని మండిపడ్డారు. తమ పార్టీ నేతలపై ఎలాంటి కేసులు, రౌడీ షీట్లు లేవని ఆయన తెలిపారు. టీడీపీ నేతలపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దీనిపై సరైన సమాధానం చెప్పకపోతే.. విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు హైకోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు. దాడి చేసిన ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. ఉదయం జిల్లా ఎస్పీని కలవనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజ్యాంగం అమలవ్వడం లేదన్నారు. ఏ కారణంతో తమ నేతలను కొట్టారని సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకుంటే రాష్ట్రంలో ఇదే అరాచక పాలన కొనసాగుతుందన్నారు.

About Author