PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీస్ ను పోల్ కు క‌ట్టేసి కొట్టారు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :డ్యూటీ మీద వ‌చ్చిన పోలీస్ ను కొంద‌రు ఆక‌తాయిలు పోల్ కు క‌ట్టేశారు. అనంత‌రం దాడి చేశారు. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని మోతీహరి ప్రాంతం సమీపంలోని ధర్మపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో కొంతమంది మద్యం తాగి గొడవ చేస్తున్నారని సమాచారం అందటంతో ఓ పోలీసు ధర్మపూర్‌ గ్రామానికి వెళ్లారు. ఊరిలోకి చేరుకున్న పోలీసును ఒక్కసారిగా కొంతమంది దుండగులు చుట్టుముట్టి పోల్‌కు కట్టేసి దాడి చేశారు. అందులో ఇద్దరు వ్యక్తులు పోలీసును కొడుతూ, దుర్భాషలాడారు. ఈ ఘటనను మరో వ్యక్తి వీడియో తీశాడు. ఇక్కడ గొడవ జరిగినట్లు మీకు ఎవరు చెప్పారని అడుగుతూ పోలీసును నిలదీశాడు. అదేవిధంగా దీపావళి సందర్భంగా ఎటువంటి గొడవలు ఇక్కడ జరగవని ఎందుకు తమ ఊరికి రైడ్‌ చేయడానికి వచ్చారని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

About Author