మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం..!!!
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఖండించిన వైఎస్ఆర్సీపీ స్టేట్ మహిళా జోనల్ ప్రెసిడెంట్ గాజుల శ్వేతా రెడ్డి, స్టేట్ మహిళా కార్యదర్శి నాగవేణి రెడ్డి ,కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ , స్టేట్ మహిళా నాయకురాలు భారతి , టౌన్ అధ్యక్షురాలు మంగమ్మ , 4వార్డు కార్పొరేటర్ ఫారిన్ మాజీమంత్రి విడదల రజని పట్ల నిన్న చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు వ్యవహరించిన తీరును రాష్ట్రం,దేశం మొత్తం చూసింది.ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి విడదల రజిని పై పోలీసులు దౌర్జన్యంకు పాల్పడ్డారు. రాష్ట్రంలో మహిళల పట్ల పోలీసులు అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు.పలు సందర్భాల్లో ఇది రుజువైంది కూడా.మహిళలపై దాడులు,దౌర్జన్యాలు, అత్యాచారాలను అడ్డుకునే పని మానేసి,అధికార పార్టీకి కొమ్ముకాసే పనిలో కొందరు పోలీసు అధికారులున్నారు.మా పార్టీ నాయకురాలు విడదల రజని విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుని వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది.వైస్సార్సీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అరెస్టుకి గల కారణాలను అడగడం కూడా నేరమా? పోలీసులను ప్రశ్నిస్తే మహిళ అని కూడా చూడకుండా దాడి చేస్తారా? చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే రౌడీల్లా వ్యవహరించడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో దిగజారిపోయాయనే దానికి ఈ ఘటనే ఉదాహరణ. సీఐ సుబ్బారాయుడుని వైయస్సార్సీపీ నాయకుల మీద ఈ విధంగా కక్షసాధింపులకు పాల్పడేందుకే టీడీపీ ఎమ్మెల్యే నియమించుకున్నారు. మాజీ మంత్రి విడుదల రజిని పట్ల చిలుకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు సభ్యతా, సంస్కారాలను మరిచిపోయి కీచకుడిలా వ్యవహరించారు.తప్పులను సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారికి రెడ్ బుక్ రాజ్యాంగంలో రక్షణ లేకుండా పోయింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు గాలికి ఎగిరిపోయాయని, చంద్రబాబు మోసం చేస్తున్న తీరును సామాజిక మాధ్యమాల ద్వారా నిలదీస్తున్న వారిని వ్యక్తిగతంగా హింసించేందుకు తెగబడ్డారని తీవ్రంగా మండి పడ్డారు.