హత్య కేసును ఛేదించిన పోలీసులు
1 min readమైదుకూరు: పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, వీరన్నబావి వద్ద ఈ నెల 10న జరిగిన హత్యకేసును మైదుకూరు పోలీసులు ఛేదించారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. మైదుకూరు –బద్వేల్ రోడ్డు లోని విజయరామరాజు కాలనీలో నివాసం ఉండే షేక్ మాబు తన రెండవ భార్య ఆదిలక్ష్మి (40) , నాని అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమెపై పగ పెంచుకున్నాడు. గత గురువారం డబ్బులు ఇస్తానని చెప్పి ఆదిలక్ష్మిని ఇందిరమ్మ కాలనీ దగ్గర ఉన్న వీరన్న బావి దగ్గరికి రమ్మని చెప్పాడు. అక్కడికి చేరుకున్న ఆదిలక్ష్మి కళ్లలో కారం పొడి చల్లి, కర్రతో తలపై బలంగా కొట్టాడు మాబు. అంతేకాక రాయితో ముఖంపై కొట్టి.. కొన ఊపిరితో ఉన్న ఆదిలక్ష్మి రెండు కాళ్లకు చున్ని కట్టి పొదలలో తోసేవాడు. బలమైన గాయాలతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు అప్పట్లో నిర్ధారించారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు ముద్దాయి మాబుని బద్వేల్ రోడ్డు లోని టిటిడి కళ్యాణ మండపం, పెట్రోల్ బంకు వద్ద అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ విజయ్‌కుమార్ వెల్లడించారు.