PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

1 min read

( పోలీసు ఫ్లాగ్ డే) కార్యక్రమాలలో బాగంగా మక్తల్ మాడల్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహణ.

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:  పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీసు ఫ్లాగ్ డే)  కార్యక్రమాల్లో భాగంగా  ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS గారి ఆదేశాల మేరకు మక్తల్ మడల్ పోలీస్ స్టేషన్ లో  పోలీసు అధికారులు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.    ఈ  కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సమాచారాన్ని మరియు పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వర్తించే విధులకు సంబంధించిన విషయాలను మరియు ఆయుధాల గురించి,  పోలీసు చట్టాల గురించి, సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాల గురించి,  ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రైట్ గేర్ ఉపయోగాలు, వినియోగించే విధానం, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల, పోలీస్ స్టేషన్ల బ్లూ కొట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ గురించి  మరియు సైబర్ నేరాల గురించి వైర్లెస్ సెట్ ద్వారా పోలీసులు మాట్లాడే విధానాన్ని విద్యార్థులకు అధికారులు వివరించి వారితో  మాట్లాడించి పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎమర్జెన్సీ సమయంలో కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుందో విద్యార్థులకు కళ్ళకు కట్టినట్లు చూపించారు. డయల్ 100 పనితీరు, పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ పోలీస్ అధికారి ఫిర్యాదుదారులు వస్తే వారితో మాట్లాడే విధానం మొదలగు విషయాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా అదనపు ఎస్పీ నాగేంద్రుడు గారు మాట్లాడుతూ… పోలీస్ అమరవీరుల త్యాగాల గురించి, 24 గంటల విధులు నిర్వర్తించే విధానం, పోలీసులు విధులు నిర్వర్తించే సమయంలో సంఘ విద్రోహశక్తులచే పోరాడి వీరమరణం పొందిన పోలీసుల అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ  ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు పోలీసులు అనే భయాన్ని తొలగించడానికి ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని తెలిపారు. అలాగే విద్యార్థిని, విద్యార్థులకు ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని  మరియు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి  విద్యార్థినీ విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు స్వయంగా అన్ని రకాల  ఆయుధాల గురించి తదితర అంశాల గురించి వాటి పేర్లు అడిగి తెలుసుకున్నారు,  ఉత్సవంగా విద్యార్థులు పాల్గొన్నారు మరియు సైబర్ నేరాలు సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో వివరించారు . మరియు జిల్లా పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాలను వాటి వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించడం జరిగింది.  పోలీసు చట్టాలు పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి  విద్యార్థినీ విద్యార్థులకు కమ్యూనికేషన్ విహెచ్ఎఫ్ సెట్  తదితర అంశాల గురించి అవగాహన కల్పించడం జరిగింది.  బాలికలు మహిళల రక్షణకు ఏర్పాటుచేసిన షి టీమ్స్, పోలీసు కళాబృందం యొక్క సేవల గురించి అవగాహన కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. డయల్ 100, సైబర్ నేరం జరగగానే 1930  టోల్ ఫ్రీ నెంబర్ ల గురించి కూడా విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐ రామ్ లాల్,  SI పర్వతాలు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు మొదలవారు పాల్గొన్నారు.

About Author