NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బంగార్రాజు హ‌త్యపై పోలీసులు స్పందించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​ :విశాఖ జిల్లా ఏనుగుల పాలెంలో మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ మేన‌ల్లుడు ల‌క్ష్మణ‌రావు గెస్ట్ హౌస్ స‌మీపంలో ల‌భ్యమైన బంగార్రాజు మృత‌దేహం పై పోలీసులు స్పందించాల‌ని టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ‌ రాశారు. బీసీ కులానికి చెందిన బంగార్రాజు దారుణ హ‌త్యకు గుర‌య్యార‌ని చంద్రబాబు లేఖ‌లో పేర్కొన్నారు. ప్రశాంత‌త‌కు మారుపేరైన విశాఖ క‌బ్జాల‌కు, క్రైమ్ కు కాపిట‌ల్ గా మారింద‌న్నారు. మృత‌దేహం ల‌భించి నాలుగురోజులైనా పోస్టుమార్టం నిర్వహించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని అన్నారు. హంత‌కులపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవ‌డంలో పోలీసు శాఖ జాప్యం.. విశాఖ‌ప‌ట్నంలో శాంతిభ‌ద్రత‌ల స‌మ‌స్యకు దారితీస్తుంద‌న్నారు. బంగార్రాజు విద్యుత్ శాఖలో లైన్ మెన్ గా పనిచేస్తున్నారు.

About Author