PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారాలోకేష్‌ను పోలీస్ స్టేష‌న్ల చుట్టూ తిప్పుతున్న పోలీసులు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : హ‌త్యకు గురైన విద్యార్థిని ర‌మ్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు టీడీపీ నేత నారా లోకేష్ వెళ్లారు. దీంతో ఘ‌ట‌నా స్థలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైకాపా, టీడీపీ శ్రేణుల మ‌ధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో నారా లోకేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ పేరుతో నారా లోకేష్ ను పోలీస్ స్టేష‌న్ల చుట్టూ తిప్పుతున్నారని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. మొద‌ట ప్రత్తిపాడు పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. అనంత‌రం గుంటూరుకు త‌ర‌లించారు. ప్రత్తిపాడు నుంచి గుంటూరుకు నారా లోకేష్ కాన్వాయ్ వెళ్లింది. టీడీపీ నేత‌ల అరెస్టుపై నారా లోకేష్ నిర‌స‌న తెలిపారు. మ‌ధ్యాహ్నం భోజ‌నం కూడ నిరాక‌రించారు. లోకేష్ తో పాటు టీడీపీ నేత‌లు ధూళిపాళ్ల న‌రేంద్ర, ఆల‌పాటి రాజా, న‌క్కా ఆనంద‌బాబుల‌ను అరెస్టు చేశారు. లోకేష్ ను విడుద‌ల చేయాల‌ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేత‌లు ఆందోళ‌న చేస్తున్నారు.

About Author