NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పునీత్ కు వైద్యం అందించిన డాక్టర్ కు పోలీస్ బందోబ‌స్తు !

1 min read

పల్లెవెలుగు వెబ్​:క‌న్నడ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు వైద్యం అందించిన డాక్టర్ ర‌మ‌ణా రావుకు పోలీసు బందోబ‌స్తు క‌ల్పించారు. పునీత్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కార‌ణ‌మ‌ని బెంగ‌ళూరులోని స‌దాశివ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్లో రెండు కేసులు న‌మోద‌య్యాయి. ఈ నేప‌థ్యంలో స‌దాశివ‌న‌గ‌ర్ లో నివ‌సించే పునీత్ ఫ్యామిలీ డాక్టర్ ర‌మ‌ణారావుకు, ఆయ‌న క్లినిక్ కు పోలీసు బందోబ‌స్తును క‌ల్పించారు. పునీత్ కు ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య లేద‌ని, త‌మ క్లినిక్ కు వ‌చ్చిన‌ప్పుడు ప్రాథ‌మిక చికిత్స చేశామ‌ని డాక్టర్ ర‌మ‌ణారావు చెప్పారు. ఫిట్ నెస్ విష‌యంలో ఎన్నో జాగ్రత్తలు పాటించే పునీత్ అక్టోబ‌ర్ 29న జిమ్ చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం విక్రమ్ హాస్పిట‌ల్ కు వెళ్లారు. వైద్యులు ఎంతో ప్రయ‌త్నించినా ఫ‌లితం ద‌క్కలేదు. పునీత్ ప్రాణాలు వైద్యులు కాపాడ‌లేక‌పోయారు.

About Author