పోలీస్ స్పందనకు…81 ఫిర్యాదులు
1 min readవిచారణ జరిపి…న్యాయం చేస్తాం : ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపియస్
పల్లెవెలుగు, కర్నూలు:జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 81 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) మా కుమారునికి మిలిటరీ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని కోడుమూరు మండలం , పులకుర్తి గ్రామానికి చెందిన క్రిష్ణ ఫిర్యాదు చేశారు.
2) కర్నూలు కు చెందిన ఒక కళాశాల యాజమాన్యం ఇంటర్మిడియట్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బనగాన పల్లెకు చెందిన మధుకళ్యాణ్ ఫిర్యాదు చేశారు.
3) 500 క్వింటాల పత్తి కొనుగోలు చేసి తీసుకెళ్ళిన వ్యక్తి మా గ్రామ రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గూడురు మండలం , గుడిపాడు గ్రామానికి చెందిన రైతులు నాగేశ్వర రెడ్డి , నీలప్ప, వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.
4) బెంగుళూరుకు చెందిన వ్యక్తి కారు అమ్ముతామని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశాడని కోడుమూరుకు చెందిన జాని ఫిర్యాదు చేశారు.
5) మా స్ధలాన్ని కబ్జా చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని జోహారాపురం కు చెందిన రంగారెడ్డి ఫిర్యాదు చేశారు.
6) పొలం మరియు స్ధలాలు ఇవ్వకుండా నా భర్త అన్న ఇబ్బందులకు గురి చేస్తున్నారని హాలహార్వీ కు చెందిన సాయిబమ్మ ఫిర్యాదు చేశారు.
స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు హామీ ఇచ్చారు.ఈ స్పందన కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసులు , లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, సిఐలు పాల్గొన్నారు.